కాంగ్రెస్ చచ్చిపోయింది: వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి గళం పెరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్న వేళ ఇతర సీనియర్ నేతలు కూడా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. పార్టీలో అసలైన కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు లేకుండా పోతోందని సీనియర్ నేత వీ హనుమంత రావు ఆరోపించారు. కాంగ్రెస్ చచ్చిపోయిందని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారని వీహెచ్ పేర్కొన్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి పై చర్యలకు పార్టీ అదిష్ఠానం సిద్ధమవుతోంది.