ఈ 3 సినిమాలు హిట్ కావాలి: చిరంజీవి
దసరా రోజున(అక్టోబర్ 5) తన మిత్రుడు అక్కినేని నాగార్జున నటించిన మూవీ ది ఘోస్ట్ కూడా రిలీజ్ అవుతుందని హీరో చిరంజీవి పేర్కొన్నారు. దీంతోపాటు యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ సినిమా స్వాతిముత్యం కూడా విడుదలవుతుందని..ఈ చిత్రాలన్ని హిట్ కావాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. నిన్న ఏపీ అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా వెల్లడించారు. చిన్న, పెద్ద సినిమాలు అన్ని ప్రేక్షకులచే ఆదరించబడినప్పుడే సినిమా పరిశ్రమ బాగుంటుందని చిరు అభిప్రాయం వ్యక్తం చేశారు.