PS-1 ట్రైలర్ లాంచ్ చేయనున్న రజినీ, కమల్
మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్-1 మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ కానుంది. సాయంత్రం 6 గంటలకు నెహ్రు ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ & మ్యూజిక్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా సూపర్‌స్టార్ రజినీకాంత్, కమల్‌హాసన్ హాజరవుతున్నారు. పొన్నియన్ సెల్వన్-1 సెప్టెంబర్ 30న పాన్ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. ఐశ్వర్యరాయ్, విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి వంటి స్టార్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ దీనికి మ్యూజిక్ అందించారు.