• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆరా

    రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేస్తూ.. ‘విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’.అని జగన్ పేర్కొన్నారు.

    ఏపీ రైలు ప్రమాదం.. పట్టాలు పునరుద్ధరణ

    ఏపీ విశాఖ: రైలు ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు అనుగుణంగా పట్టాలను పునరుద్ధరించారు. 19 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ చేశామని అధికారులు వెల్లడించారు. రైలు ప్రమాద ఘటనలో 13 మంది మరణించారని తెలిపారు. మరో 30 మంది గాయపడ్డారని వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

    రెండు రైళ్లు ఢీకొని 20 మంది మృతి

    బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఉన్న రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కొల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ధ్వంసమైన కోచ్‌లను తొలగించేందుకు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. .

    రైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం

    నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరస్వతీదేవీ దర్శనానికి వెళ్తూ తండ్రి, కుమార్తె రైలు ప్రమాదంలో మృతి చెందారు. బాసరలో సరస్వతీ దేవికి పూజకు కుటుంబసభ్యులతో రామచంద్రరావు హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరారు. నిజామాబాద్‌లో మరో బోగీలోకి మారేందుకు వారు రైలు దిగారు. ఈ క్రమంలో రామచంద్రరావు చిన్న కుమార్తె జననిని బోగీలోకి ఎక్కిస్తుండగా రైలు ముందుకు కదిలింది. ఈ క్రమంలో జనని పట్టుతప్పి రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించి తండ్రి కూడా రైలు కిందపడి మరణించాడు.

    రైలు ప్రమాద బాధితులకు అండగా సోనూసూద్

    ఒడిశా రైలు ప్రమాద బాధితులకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ అండగా నిలిచాడు. ఈ ప్రమాదంలో బాధితులుగా మిగిలినవారికి జీవితకాలం పింఛన్ లేదా నెలనెలా జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ సందేశం పంపాడు. కంటితుడుపు పరిహారం చెల్లించకుండా శాశ్వత పరిహారం ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ప్రకటించిన పరిహారం రెండు మూడు నెలల్లోనే ఖర్చుయిపోతుందన్నాడు. పెన్షన్ గానీ, స్థిరాదాయం కల్పించడం గానీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. Heartbroken by the news of the train tragedy in … Read more

    దేవుడా.. గుండెల్ని పిండేసే వీడియో!

    ఒడిశా ఘోర రైలు ప్రమాదం కారణంగా ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో ఓ వీడియో అందరి గుండెల్ని పిండేస్తోంది. ఓ హాలులో కుప్పలా పోసిన మృతదేహాలు పడేసి ఉన్నాయి. అందులోకి వెళ్లిన ఓ తండ్రి తన కొడుకు కోసం ఆ మృతదేహాల్లో వెతుకుతూ ఉన్నాడు. దేవుడా వీరిలో నా కొడుకు ఉండకూడదంటూ లోలోపల అనుకుంటూ వెతికాడు. కానీ అతడి కొడుకు అక్కడ దొరకలేదు. అతడు బతికి ఉన్నాడో లేదో తెలియక వెతుకుతూనే ఉన్నాడు. This is heartbreaking ? A father … Read more

    VIDEO: రెండు రైళ్లు ఇలా ఢీకొన్నాయి

    బాలేశ్వరం ప్రమాదం జరిగిన తీరు, అక్కడి దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ప్రయాణికులతో ఉన్న రెండు రైళ్లు, ఒక గూడ్స్ ఢీకొనడం ఈ విషాదానికి కారణమైంది. ఒక రైలు బోగీపై మరొకటి వెళ్లిపోవడం, సహాయక సిబ్బంది మృతదేహాలన్నింటిని ఒక వరుసలో ఉంచిన దృశ్యాలు దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. రెండు రైళ్లు అతివేగంతో వెళ్లడంతో ఈ మూడింటి మధ్య తాకిడి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో కొన్ని బోగీలు గాల్లోకి లేచి, తిరిగిపోయాయి. రైలు ప్రమాదం జరిగిన తీరును కొన్ని మీడియా సంస్థలు గ్రాఫిక్స్ ద్వారా తెలిపాయి.

    హృదయ విదారకంగా ప్రమాద దృశ్యాలు

    బాలేశ్వర్ రైలు ప్రమాదం దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఒడిశాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వార్డుల్లో శవాల కుప్పలు భీతి కలిగిస్తున్నాయి. క్షతగాత్రుల రోధనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 238కి పెరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది ఇంకా బోగీల్లోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు చూసుకునేందుకు పైన Watch Onపై క్లిక్ చేయండి. A country does not become great just because its Prime Minister changes clothes every hour. The country … Read more

    ‘రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి’

    బాలేశ్వర్ రైలు ప్రమాదంపై ప్రపంచదేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. The images and reports of the train crash in Odisha, India break my heart. I’m sending my deepest condolences … Read more

    రైలు ప్రమాదంపై హైలెవల్ కమిటీ

    ఒడిశా- రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు రైల్వే శాఖ ఆదేశించింది. ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా.. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం.. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం’ అని పేర్కొన్నారు. #WATCH | Railways … Read more