రేపు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
వచ్చే శాసనసభ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధత మొదలుపెడుతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడమే లక్ష్యంగా గులాబీ అధినేత కేసీఆర్ సమగ్ర కార్యచరణ అమలుపై దృష్టిసారించారు. మంగళవారం పార్టీ శాసనసభ, పార్లమెంటరీ, రాష్ట్ర కార్యవర్గాలతో సమావేశం నిర్వహించనున్నారు. భారత రాష్ట్ర సమితికి వచ్చే నెలలో గుర్తింపు వచ్చే అవకాశముంది. పార్టీ పేరు మార్పు, జాతీయ సంకల్పం, విస్తరణ లక్ష్యాలను కేసీఆర్ వివరించనున్నారు. మునుగోడులో 22 వేలకు పైగా ఓట్లు పెరిగినప్పటికీ.. కాంగ్రెస్ ఓటుబ్యాంకు భాజపా వైపు వెళ్లినట్లు టీఆర్ఎస్ భావిస్తోంది. ఇలాంటి పరిణామాలను ఎలా అధిగమించాలో … Read more