‘TRS పార్టీని బొందపెట్టేది బీజేపీనే’
ఇదే కేసీఆర్ సీఎం హోదాలో ఉండి కేంద్రమంత్రి, గవర్నర్, మోదీలను ఇష్టం వచ్చినట్లు అంటే తప్పులేదా అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిలదీశారు. దొంగనే దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. ప్రజలు అన్ని చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చేప్తారని వెల్లడించారు. కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోయేది లేదన్నారు. TRS పార్టీని బొందపెట్టేది బీజేపీనేనని ఈటల పేర్కొన్నారు. స్పీకర్ గారిని మర మనిషిలాగా పని చేస్తున్నడని అంటే తప్పువచ్చిందని ఎద్దేవా చేశారు. ఇతరులు చెప్పినట్లు చేస్తున్నందునే అలా ఉన్నట్లు ఈటల వివరించారు.