• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSPSC గ్రూప్‌-4 తుది ‘కీ’ విడుదల

    TSPSC గ్రూప్‌-4 తుది ‘కీ’ విడుదలైంది. ఈ ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే ఆన్‌లైన్‌ ద్వారా అధికారులు అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీతో వెరిఫై చేయించి తాజాగా తుది కీ విడుదల చేశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

    14న సడక్ బంద్‌కు పిలుపు

    ఉద్యోగాల నియామకాల విషయంలో TSPSC వ్యవహరిస్తున్న నిర్లక్ష్యంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉద్యోగార్థుల మనోవ్యథకు కారణమైన TSPSC తీరును నిరసిస్తూ ఈనెల 14న సడక్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు నిరుద్యోగులు ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించి నిరసన చేపట్టాలని సూచించారు. ఈ సడక్ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష సరిగా నిర్వహించలేదని హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

    మాటలు రాకున్నా గ్రూప్‌-1 పాసైంది..కానీ..!

    మాటలు సరిగా రావు, చెవులు సరిగా వినబడవు అయినా కష్టపడి చదివి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పాసైంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతోంది. ఇంతలో గ్రూప్‌-1 పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దయింది. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితిలో..మరోసారి పరీక్ష రాసే స్తోమత లేదని…దాతలు ఆదుకోవాలని కోరుతోంది. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శాంతినగర్‌కు చెందిన భవానీకి మీ వంతు సాయం చేయండి.

    SI, కానిస్టేబుల్‌ పేపర్లను కూడా లీక్‌ చేశారు!

    TSPSC ప్రశ్నాపత్రాల లీకు ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా నిర్వహించిన SI, కానిస్టేబుల్‌ పరీక్ష పేపర్లు కూడా లీక్‌ అయ్యాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక, ఈవెంట్స్‌ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నెగెటివ్‌ మార్కులు ఉన్నప్పటికీ SI అభ్యర్థికి అత్యధికంగా 133 మార్కులు, కానిస్టేబుల్‌ అభ్యర్థికి 141 మార్కులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని లేదంటే ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. ఏఈ పరీక్ష లీక్‌తో..  టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ఏఈ … Read more

    TSPSC ఆఫీసులో ముగిసిన నిందితుల విచారణ

    తెలంగాణ: టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ల సిట్‌ విచారణ ముగిసింది. దర్యాప్తు అనంతరం నిందితులను సిట్‌ అధికారులు తమ కార్యాలయానికి తరలించారు. వారితో పాటు TSPSC ఆఫీసులోని ఒక సిస్టమ్‌ను తీసుకెళ్లారు. అంతకుముందు TSPSC ఆఫీసుకు నిందితులను తీసుకెళ్లిన సిట్‌ బృందం ప్రశ్నాపత్రాలను ఎలా లీక్‌ చేశారన్న కోణంలో ఆరా తీసింది. కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి టెక్నికల్‌ అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

    టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకు ఘటనలో కొత్త ట్విస్ట్‌!

    TSPSC పేపర్‌ లీకు ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. CDPO & EO పరీక్షా పేపర్లు కూడా లీకు అయ్యాయని మహిళా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 46వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఆయా పరీక్షలను రద్దు చేసి కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనలను మమ్మరం చేస్తామని మహిళా అభ్యర్థులు హెచ్చరించారు.

    TSPSC పేపర్‌ లీక్‌.. సిట్‌ దర్యాప్తు ముమ్మరం

    TSPSC పరీక్షా పేపర్ల లీక్‌ ఘటనపై ‘సిట్‌’ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిట్‌ అధికారులు అక్కడి నుంచి నేరుగా TSPSC కార్యాలయానికి తరలించారు. అనంతరం అక్కడి కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌లోకి నిందితులను తీసుకెళ్లారు.టెక్నికల్‌ విషయాలపై ప్రవీణ్‌, రాజశేఖర్‌లను సిట్‌ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.పేపర్‌ లీక్‌ ఎలా జరిగిందన్న కోణంలో నిందితులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

    తెలంగాణవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు

    TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. TSPSCని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు పలువురు బీజేపీ నాయకులు, శ్రేణులను అరెస్టు చేసి పరిస్థితిని అదుపు చేశారు.

    పేపర్ లీక్ చేసింది బీజేపీ కార్యకర్తే: కేటీఆర్

    TSPSC ప్రశ్నాపత్రాలు లీకవడం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం. పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. నిందితుడిగా ఉన్న రాజశేకర్ రెడ్డి బీజేపీ క్రియశీల కార్యకర్త అని తెలిపారు. లీకేజీలో కుట్ర కోణం దాగిఉందని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

    పేపర్ లీకేజీపై కేటీఆర్ ప్రెస్‌మీట్

    LIVE: పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్‌కి నివేదిక అందించామని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమమైన కమిషన్లలో టీఎస్‌పీఎస్సీ ఒకటని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్, 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్లు టీఎస్‌పీఎస్సీని సందర్శించారని వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో అత్యధిక నియామకాలు జరిపిన కమిషన్ టీఎస్‌పీఎస్సీ అని కొనియాడారు.