• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే!

    AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నాలుగు కాంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. రూ.300 దర్శనానికి 3 గం.లు పడుతున్నట్లు చెప్పింది. నిన్న 85,497 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,873 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.41కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

    తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో ములాఖత్‌లో చెప్పారు. ఏపీలో ప్రస్తుత రాజకీ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణపై ఫొకస్ పెట్టలేమని తెలిపారు. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నమో టీడీపీ కార్యకర్తలకు వివరించాలని ఆయన సూచించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తప్పుకున్నట్లైంది.

    తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్‌

    AP: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఈ నెల 24 నుంచి 27 తేదీల మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయ ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. వాటి సంచారం ట్రాప్‌ కెమెరాల్లో రికార్డయ్యిందని తెలిపింది. కాబట్టి భక్తులు అప్రమత్తంగా ఉంటూ గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ కోరింది. ఇటీవల కాలంలో తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

    అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం

    తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయింది. దీంతో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గుంపులు గంపులుగా వెళ్లాలని తెలిపింది. మరో వైపు చిరుత, ఎలుగబంటిని బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.

    తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం పడుతున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 77,187 మంది భక్తులు దర్శించుకోగా 29,209 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్లు వచ్చింది. కాగా నేటితో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

    టీడీపీ-జనసేన కార్యాచరణపై పవన్ చర్చ

    ఏపీలో రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చెర్చించారు. ఐదో విడత వారాహి యాత్ర, టీడీపీ-జనసేన సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశంపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. రైతుల ఇబ్బందులు సాగునీరందక కృష్ణా, పశ్చిమ డెల్టాలో 4లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశంపై పవన్ చర్చించారు. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని పవన్ ఆరోపించారు.

    నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

    AP: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇవాళ రాత్రి 7-8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధు­ల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మం­డపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అక్టోబర్‌ 15–23వ తేదీల మధ్య ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉ. 9-11 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు.

    రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    ఈ నెల 14 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 19న సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారి గరుడ ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 14వ తేదీ నుంచి 23 వరకు స్వామివారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

    శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి

    సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శోభ ఈ రోజు స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. Kalvakuntla Shobha, wife of Telangana CM #KCR, went to #Tirumala Monday … Read more

    తిరుమలలో గంజాయి కలకలం

    [వీడియో; ](url) తిరుమలలో గంజాయి కలకలం రేగింది. తాజాగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని లగేజీ కౌంటర్‌లో పనిచేసే ఓ వ్యక్తి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి ప్యాకెట్లను టీటీడీ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కూడా కూరగాయల వాహనంలో తరలిస్తున్న 200 గ్రాముల గంజాయిని తిరుమల జీఎన్సీ గేట్ వద్ద ఎస్ఈబీ, విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఇలా గంజాయి కేసులు వరుసగా నమోదవడంతో టీటీడీలో కలవరం నెలకొంది. In a serious lapse, a … Read more