తెలంగాణ కట్టడాలకు యునెస్కో అవార్డులు
యునెస్కో అందించే పురస్కారాలకు తెలంగాణ నుంచి రెండు వారసత్వ కట్టడాలు ఎంపికయ్యాయి. హైదరాబాద్లోని గోల్కొండ మెట్లబావికి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’, దోమకొండ కోటకు ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ కింద పురస్కారాలు లభించాయి. దోమకొండ కోటను సంస్థానాధీశులు పునరుద్ధరిస్తుండగా.. కుతుబ్షాహీలు నిర్మించినట్లుగా చెబుతున్న ఈ గోల్కొండ మెట్లబావిని అగాఖాన్ ట్రస్ట్ సొంత నిధులతో పునర్వైభవ పనులను చేపట్టింది. బావిలోని కొంతభాగం కూరుకుపోవడంతో మరమ్మతు పనులు చేపట్టి బావికి పూర్వ వైభవాన్ని సంస్థ తీసుకొచ్చింది. ఈ పనులను మెచ్చి యునెస్కో అవార్డులకు ఎంపికచేసింది.