అమెరికాలో అదరగొడుతున్న చిరు మూవీ
ఓవర్సీస్లో ‘వాల్తేరు వీరయ్య’ అదరగొడుతోంది. అమెరికాలో అడ్వాన్స్ ప్రీ సేల్స్‌లో వాల్తేరు వీరయ్య సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్ మొదలవడంతో మెగా సునామీ షురూ అయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఆల్బమ్లోన ప్రతి పాట ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరగనుండటంతో తొలిరోజు కలెక్షన్ల వర్షం కురవనుందని టాక్.