• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిషబ్ అన్నా..పాట మార్చే జరా ?

    బ్లాక్ బస్టర్ చిత్రం కాంతారా ఓటీటీలో విడుదలైనప్పటికీ…ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. సినిమాలో ప్రధానాకర్షణగా నిలిచే వరాహరూపం పాటను మార్చటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వచ్చే పాట ప్రేక్షకుల్ని లీనం చేస్తుంది. ఇందులో రిషబ్ షెట్టి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ, ఈ పాటపై కాపీరైట్ రావటంతో ట్యూన్ మార్చారు. కొత్త ట్యూన్ అస్సలు బాగాలేదని… రిషబ్ అన్నా కొత్తది కిక్ రావట్లేదని అంటున్నారు.

    ‘వరాహ రూపం’ ఇక థియేటర్లలో రాదు!

    ‘కాంతార’ సినిమాలో థియేటర్లను ఊపేసిన ‘వరాహ రూపం’ పాటను ఇకపై థియేటర్లలో గానీ, యూట్యూబ్‌లో గానీ ప్రదర్శించవద్దని చిత్రబృందానికి కోళికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాటను తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్‌ నుంచి కాపీ కొట్టారని కేరళకు చెందిన ‘థాయికుడమ్‌ బ్రిడ్జ్‌’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది.