విద్యార్థినిలతో కలిసి టీయూ వీసీ స్టెప్పులు
తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా వ్యవహారశైలీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న రాత్రి గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా వీసీ రవీందర్తో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు గర్ల్స్ హాస్టల్లోకి వెళ్లారు. హాస్టల్లో విద్యార్థినిలతో కలిసి స్టెప్పులేశారు. డబ్బులు ఎగరేస్తూ డ్యాన్స్ చేశారు. దీనిపై విద్యార్థినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు హాస్టల్ వాడ్డెన్ను సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించారు.