• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బర్త్‌డే రోజు కోహ్లీ శతకొట్టాలి: రిజ్వాన్

    నవంబర్‌ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. అదే రోజు కోహ్లీ పుట్టినరోజు కావడంతో దీనిపై పాక్ బ్యాటర్‌ మహమ్మద్ రిజ్వాన్‌ స్పందించాడు. విరాట్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ ఆ రోజు కోహ్లీ సెంచరీ చేయాలని ఆకాంక్షించాడు. ‘ఈ బర్త్‌ డే కోహ్లీకి మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలి. పుట్టినరోజున 49వ వన్డే సెంచరీని అందుకుంటాడని ఆశిస్తున్నా. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ 50వ వన్డే సెంచరీ కూడా సాధించాలి’ అని రిజ్వాన్‌ అన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో 48 సెంచరీలతో ఉన్న కోహ్లీ మరో శతకం చేస్తే వన్డేల్లో … Read more

    వరల్డ్‌కప్‌లో కోహ్లీ ఆహారం ఇదే..!

    ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ ఆహార నియమాల గురించి ఆయన బస చేసిన హోటల్‌ చెఫ్‌ అనుష్మాన్‌ బాలి వెల్లడించాడు. విరాట్‌ శాఖాహారి కాబట్టి ఉడకబెట్టిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘విరాట్ ఆవిరితో ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. డిమ్‌ సమ్స్‌, సోయా, మాక్‌ మీట్‌, టోఫూ, లీన్‌ వంటి ప్రోటీన్‌ ఆధారిత ఆహారాన్ని ఫుడ్‌ మెనూగా ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు. అటు చాలా మంది ఆటగాళ్లు అధిక ప్రోటీన్‌లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నట్లు బాలి వెల్లడించారు.

    ప్రతిక్షణం మెరుగయ్యేందుకే యత్నిస్తా: కోహ్లీ

    ప్రతిక్షణం మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటానని భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటానని తెలిపాడు. ‘ప్రదర్శన మాత్రమే లక్ష్యమైతే కొంతకాలం తర్వాత సంతృప్తి చెందొచ్చు. ఆటపై పనిచేయడం మానేయొచ్చు. కానీ నేను ఎప్పుడూ నైపుణ్యం మెరుగుపరుచుకోడానికే ప్రయత్నిస్తుంటా. దానికి హద్దు లేదన్నది నా నమ్మకం. కాబట్టే సుదీర్ఘ కాలం ఆడుతూ ఉత్తమ ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లీ 118 సగటుతో 354 పరుగులు చేశాడు.

    కోహ్లీ అత్యున్నత ఆటగాడు: డారిల్‌

    టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీపై న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్‌ మిచెల్‌ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డారిల్ మాట్లాడుతూ ‘విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి అత్యున్నత ఆటగాడు. దిగ్గజాల జాబితాలోని ఆటగాడు. ఇలా చెప్పడానికి కారణముంది. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడగల సత్తా అతడి సొంతం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయకపోయినా తన జట్టును విజయపథంలో నడిపించాడు’ అని డారిల్‌ వ్యాఖ్యానించాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో డారిల్‌ సెంచరీతో చెలరేగాడు.

    అలా ఆడితే కివీస్‌ను ఓడించొచ్చు: కోహ్లీ

    కివీస్‌తో మ్యాచ్‌పై టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం వల్లే ఆ జట్టు సక్సెస్ అవుతోందని పేర్కొన్నారు. ‘ప్రొఫెషనల్‌ క్రికెట్ ఆడటంలో న్యూజిలాండ్‌ జట్టు ముందుంటుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. ఇలాంటి జట్టుతో ఆడేటప్పుడు వారి లయను దెబ్బ తీయడానికి తీవ్రంగా శ్రమించాలి. పూర్తిస్థాయి నైపుణ్యాలను వినియోగించి ఆడితేనే విజయం సాధించేందుకు అవకాశాలు వస్తాయి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు’ అని కోహ్లీ అన్నాడు.

    కోహ్లీ పోలికలతో వ్యక్తి.. వైరల్ వీడియో

    చండీఘర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్తీక్ శర్మ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియో వైరల్‌ అవుతున్నాయి. అతడు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పోలికలతో ఉండటమే దీనికి కారణం. ఈ ఫొటోలు చూస్తే కోహ్లీ, కార్తీక్ మధ్య వ్యత్యాసం తెలియడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ, కార్తీక్ ట్విన్ బ్రదర్స్‌లా ఉన్నారని మరికొందరు అంటున్నారు. కోహ్లీ అభిమాని అయిన తాను జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలుసుకోవాలని ఉందని కార్తీక్ చెబుతున్నాడు. https://www.instagram.com/reel/Cug-n5rMuZE/?utm_source=ig_embed&ig_rid=c406d3c2-f820-4efa-b895-77c9a294b5c2

    క్రికెట్‌లో ఇలాంటివి సాధారణం: కమిన్స్

    ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంపై క్రికెటర్ కమిన్స్ స్పందించాడు. తాము 200 పరుగులకే పరిమితం కావడం ఇబ్బంది కలిగించిందని, మరో 50 పరుగులు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మిచెల్ మార్ష్ కోహ్లీ క్యాచ్‌ను మిస్ కావడం గురించి అప్పుడే మర్చిపోయానని, ఇలాంటివి క్రికెట్‌లో సర్వసాధారణం అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా, ఈ లైఫ్ తర్వాత కోహ్లీ మెరుగ్గా ఆడి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. https://www.instagram.com/reel/CyI_IFJPRJY/?utm_source=ig_embed&ig_rid=abd1fd86-cc97-4dd2-9e17-74ce4bd3db35

    క్రికెట్ కామెంటరీతో అలరించిన రవితేజ

    ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రవితేజ క్రికెట్ కామెంటరీ చెప్పారు. ఇతర వ్యాఖ్యాతలతో కలిసి ఓ వరల్డ్ కప్ మ్యాచ్‌కు రవితేజ కామెంటరీ చెప్పడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్, దూకుడు అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా రవిజేత అన్నారు. క్రికెటర్స్ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే సిరాజ్ బయోపిక్‌లో నటిస్తానని చెప్పారు. కాగా, వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా: బాబర్‌

    గతంలో విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ అజామ్‌ తాజాగా స్పందించాడు. ఆ వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఎవరి దగ్గరి నుంచైనా పాజిటివ్‌ కామెంట్లు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటివి లభిస్తే మాత్రం ఎంతో గర్వకారణంగా ఉంటుంది. కోహ్లీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కెరీర్‌లో అవి చాలా ఉపయోగపడ్డాయి. 2019లో కోహ్లీని తొలిసారి కలిసినప్పుడు అతడి మాటతీరు ఆకట్టుకుంది’ అని బాబర్‌ … Read more

    భారత్ విజృంభణ.. 114కే విండీస్ ఆలౌట్

    వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. కరేబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ని పేకమేడల్లా కూల్చేశారు. బౌలింగ్‌కు తోడు అద్భుత ఫీల్డింగ్ వెస్టిండీస్ బ్యాటింగ్ కొంప ముంచింది. దీంతో వెస్టిండీస్ 114 పరుగులకే చాప చుట్టేసింది. కెప్టెన్ షై హోప్(43) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 4, జడేజా 3 వికెట్లతో వెస్టిండీస్ నడ్డి విరిచారు. ముకేశ్ కుమార్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు. స్లిప్‌లో విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. What a … Read more