వరుస ఓటములపై బీసీసీఐ సమీక్ష..!
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమిని టీమిండియా జీర్ణించుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. జట్టులో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు, ఓటమికి కారణాలపై ఏకరువు పెట్టనుంది. మరోవైపు, టీమిండియా ఫామ్‌పై మాజీలు భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ కన్నా వేగంగా టీమిండియా ఫామ్ కోల్పోతోందని డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. టీ20లపై కనబరిచినంత శ్రద్ధ వన్డేలపై చూపించట్లేదని సెహ్వాగ్ మండిపడ్డాడు. టీమిండియా మేల్కొనడానికి ఇదే సరైన సమయం అని పిలుపునిచ్చాడు.