• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గువాహతిలో వరద భీభత్సం

    అస్సాం రాజధాని గువాహతిలో వరద భీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడడంతో గువాహతిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రుక్మిణీగావ్, హాతీగావ్‌ ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు నిలిచింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి. #WATCH | Assam: Several areas in Guwahati city face severe waterlogging and flood-like situation due to heavy rainfall … Read more

    ముంబయిని ముంచెత్తిన వానలు..నిలిచిన ట్రాఫిక్

    దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అక్కడి జనం నానా తంటాలు పడుతున్నారు. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తి ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల రైల్వే స్టేషన్లు సైతం నీటితో నిండిపోయాయి. మరికొన్ని రోజులు వానలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అధికారులు, NDRF సిబ్బందిని అప్రమత్తం చేశారు.