చలికి ఉత్తరాది గజగజ
దిల్లీలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వరుసగా మూడ్రోజులు కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో వాతావరణ శాఖ మరో ఆరు రోజుల పాటు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రానున్న ఐదురోజులు దిల్లీ సహా పంజాబ్, హర్యాణా, ఛండీగఢ్, యూపీ, రాజస్థాన్లో దట్టమైన మంచు కురిసే అవకాశం ఉంది.