సంక్రాంతికి చుక్కలు చూపించబోతున్న చలి
దేశంలో జనవరి 14 నుంచి 19 వరకు చలి తీవ్రత మరింత పెరగబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో -4 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. ఇటీవల ఉత్తర భారతంలో కాస్త ఊరట లభించినట్టు అనిపించినా.. ఇది ఎక్కువ రోజులు ఉండబోదని తెలుస్తోంది. జనవరి 16-18 మధ్య అయితే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.