2050 నాటికి ప్రపంచ జీడీపీ పతనం
కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల ప్రాణ నష్టం జరిగి, ప్రపంచ వార్షిక జీడీపీ 2050 నాటికి 3.8కు క్షీణిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో 24 మిలియన్ల మంది ప్రజలు మరింత పేదరికంలోకి జారుకుంటారని పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సౌత్ఈస్ట్ ఆసియా డైరెక్టర్ పూనమ్ సింగ్ మాట్లాడుతూ..కొన్ని రకాల వైరస్ల వల్ల 2019 నుంచి దాదాపు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వైరస్ల నివారణ కోసం ‘వరల్డ్ యాంటీమైక్రోబయాల్ అవేర్నెస్ వీక్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.