• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌‌లో కొత్త ఫీచర్‌

    యూట్యూబ్‌ మొబైల్‌ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ‘వాచ్‌ పేజ్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. యూట్యూబ్‌లో వస్తున్న ఫేక్‌ న్యూస్‌ను అరికట్టి విశ్వసనీయ వార్తలను యూజర్లకు అందించాలని యూట్యూట్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల యూట్యూబ్‌లో ఫేక్‌ ఛానెళ్లను అరికట్టాలని సూచించింది. ఈ క్రమంలో యూట్యూబ్‌ ఈ ప్రకటనను వెలువరించింది.

    యూట్యూబ్‌‌లో కొత్త ఫీచర్‌

    యూట్యూబ్‌ మొబైల్‌ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ‘వాచ్‌ పేజ్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. యూట్యూబ్‌లో వస్తున్న ఫేక్‌ న్యూస్‌ను అరికట్టి విశ్వసనీయ వార్తలను యూజర్లకు అందించానిని యూట్యూట్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల యూట్యూబ్‌లో ఫేక్‌ ఛానెళ్లను అరికట్టాలని సూచించింది. ఈ క్రమంలో యూట్యూబ్‌ ఈ ప్రకటనను వెలువరించింది.

    ‘ఖుషీ’ ట్రైలర్ దెబ్బకు యూట్యూబ్‌ షేక్

    విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే తెలుగులో 10 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.

    యూట్యూబ్‌లో ‘పవర్’ సునామీ

    పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’ మూవీ టీజర్ అదరగొడుతోంది. నిన్న సాయంత్రం ఈ టీజర్‌ని విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అప్పుడే 10మిలియన్లకు పైగా వ్యూస్‌ని దక్కించుకుంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్స్ మాటలు అందించారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. జులై 28న మూవీ విడుదల కానుంది.

    ‘కళ్యాణం కమనీయం’ లిరిక్ వీడియో విడుదల

    సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమా నుంచి ‘హో ఎగిరే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియా భవాని శంకర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. యువి కాన్సెప్ట్స్ పతాకంపై అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాటుక కన్నే.. దాచెను నన్నే అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రావణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా.. కపిల్ కపిలన్ పాటను ఆలపించాడు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ తరువాత … Read more

    ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్; గూస్‌బంప్స్ పక్కా

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘‘వీరయ్య.. వీరయ్య’’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే ఈ పాటను 5 మిలియన్ల మంది వీక్షించారు. ఈ పాటలో బాస్ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దేవీశ్రీప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, పవిత్రాచారి ఆలపించారు. ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    YouTubeలో అదిరే ఫీచర్

    యూట్యూబ్‌లో నిర్దిష్టమైన సమాచారం కోసం మనం వీడియో మొత్తం చూడాల్సి ఉంటుంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా యూట్యూబ్ కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. ‘సెర్చ్ ఇన్ వీడియో’ ద్వారా వీడియోలో మనకు కావాల్సిన అంశం గురించి వెతకొచ్చు. దీంతో యూజర్లకు సమయం ఆదా అవుతుందని గూగుల్ ప్రకటించింది. దిల్లీలో జరుగుతున్న ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ కార్యక్రమంలో ఈ ఫీచర్‌ని తీసుకొస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దిల్లీకి సంబంధించిన వీడియో చూస్తుంటే.. కింద సెర్చ్‌లో ఎర్రకోట గురించి వెతికామనుకోండి. వెంటనే పై వీడియోలోని ఎర్రకోట విజువల్స్‌ని … Read more

    రంజింపజేస్తున్న ‘రంజితమే’ సాంగ్‌

    తమిళ్ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం వారసుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘రంజితమే’ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. హీరో విజయ్, ఎంఎం మానసి కలసి పాడిన ఈ పాటకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఈ పాటకు యూట్యూబ్‌లో 40 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా వారసుడు చిత్రాన్ని డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

    Know all about Youtube Shorts Funding Program

    This generation’s primary source of entertainment is short videos. Everyone likes these mini videos, from early teenagers to the elderly. Short videos are the most engaging digital content. Short video creators put in a lot of effort to create these fun and enjoyable 60-second flicks. Vine, the first short-video sharing tool, launched the short video trend in the west. Tik-Tok … Read more