• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల

    YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా పోలీసులపై చేయి చేసుకున్నారు. ఇంటి నుంచి తనను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో SIపై చేయి చేసుకున్నారు. వ్యక్తిగత పనులకు కూడా తనను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎందుకు వెళ్లనివ్వడం లేదో కారణం చెప్పాలని రోడ్డుపై బైటాయించారు. పోలీసులు తిరిగి ఆమెను ఇంట్లోకి పంపించారు. పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా షర్మిలపై బంజారహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 350కింద కేసు నమోదు చేశారు.

    షర్మిలకు సామాన్యుడి ఝలక్!

    [VIDEO: ](url)వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలోని జనగామ జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిలపై ఓ యువకుడు ఫైర్ అయ్యాడు. సీఎం కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో షర్మిల అతనిపై తిరిగి ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మీ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వచ్చాయి.. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి.’’ అని ప్రశ్నించింది. KCR ను తిడితే ఊరుకోను.. షర్మిల పై ఫైర్ అయిన యువకుడు #YSSharmila #KCR … Read more

    సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తనతోపాటు కేసీఆర్ కూడా [పాదయాత్ర](url) చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక వేళ ప్రజా సమస్యలుంటే కేసీఆర్ సీఎం పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవాలని.. సమస్యలు లేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని.. కానీ కేసీఆర్, కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. #WATCH | Today I challenge Telangana CM KCR to walk … Read more

    వరంగల్‌లో షర్మిల అరెస్టు

    [VIDEO:](url) వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగనున్న దృష్ట్యా ఆమెను చెన్నారావుపేట శంకర తండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె కేరవాన్‌కి తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై షర్మిల స్పందించారు. తన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేయించారని ఆరోపించారు. Few people alleged to … Read more