• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జొమాటో కొత్త సర్వీసు

    ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. జొమాటో ఎక్స్‌ట్రీమ్ పేరిట పార్శిల్ సర్వీసులను ప్రారంభించింది. చిన్న చిన్న పార్శిళ్లను పంపించడం లేదా స్వీకరించడం కోసం ఎక్స్‌ట్రీమ్ సేవలను వినియోగించుకోవచ్చని జొమాటో పేర్కొంది. ఇప్పటికే ఇందులో 3 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు భాగస్వాములుగా ఉన్నారని జొమాటో పేర్కొంది. 10 కి.మీ దూరం వరకు ప్యాకేజీలను పంపించుకోవచ్చని తెలిపింది. ఈ సేవలు రూ.35 నుంచి ప్రారంభమవుతాయని జొమాటో పేర్కొంది.

    జోమాటో బాయ్‌పై దాడి చేసిన శునకం

    ముంబైలో జోమాటో డెలివరి బాయ్‌కి ఊహించని ఘటన ఎదురైంది. పన్వేల్‌ అపార్ట్‌మెంట్‌కు పుడ్ డెలివరీ చేసేందుకు నరేంద్ర అనే వ్యక్తి వెళ్లాడు. లిఫ్ట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అందులో జర్మన్ షెపర్డ్ కుక్క కనిపించింది. వెంటనే బెదిరి వెనుకడుగు వేశాడు. అయితే కుక్క యాజమాని దాన్ని వెనక్కి గుంజడంతో ధైర్యం చేసి లిఫ్ట్‌లోకి వెళ్లాడు. వెంటనే ఆ శునకం డెలివరీ బాయ్ ప్రైవేట్‌ పార్ట్‌ను గట్టిగా కొరికేసింది. దీంతో అక్కడి వారు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స తీసుకున్నా నొప్పి ఇంకా తగ్గలేదని … Read more

    డెలివరీ బాయ్‌ని షూతో కొట్టిన మహిళ

    జొమాటో డెలివరీ బాయ్‌ని ఓ మహిళ షూతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. Dj అనే పేరుతో ఉన్న ఓ ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఆగస్ట్‌ 16న షేర్‌ చేసిన ఈ వీడియోపై జొమాటో స్పందిస్తూ దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపింది. శాండ్విచ్‌ ఆర్డర్‌ చేసిన మహిళ అది తన ఆర్డర్‌ కాదని చెబుతున్నా వినకుండా జొమాటో బాయ్‌పై దాడి చేసినట్లు ట్విట్టర్‌ పోస్ట్‌లో వివరించారు. వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. … Read more