• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పిచ్‌ల విషయంలో ఇండియన్ క్యూరేటర్ల సాయం తీసుకోండి’

    పాకిస్తాన్ జట్టు ఫలితం తేలని పిచ్‌లు తయారు చేస్తూ 24 సంవత్సరాల తర్వాత పాక్ గడ్డపై నిర్వహిస్తున్న టెస్టు సిరీస్‌ను నిర్వీర్యం చేసేసింది. దీంతో పీసీబీ మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మొదటి టెస్టులో ఆడిన రావల్పిండి మైదానానికి ఐసీసీ యావరేజ్ కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది. దీంతో పీసీబీ అలర్ట్ అయింది. లాహోర్ వేదికగా జరిగే మూడో టెస్టు కోసం ఐసీసీ అకాడమీ మాజీ హెడ్ క్యూరేటర్ టాబీని పిలిపించింది. ఇతడి పర్యవేక్షణలో పిచ్‌ను తయారు చేస్తామని ప్రకటించింది. కానీ దీనికి బదులు మీరు ఇండియన్ క్యూరేటర్ల సాయం తీసుకోవచ్చు కదా అని పాక్ మాజీ పేసర్ అకిబ్ జావెద్ వ్యాఖ్యానించారు. వారు టర్నింగ్ పిచ్‌లను తయారు చేయడంలో దిట్ట అని కామెంట్ చేశారు.