జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు.’డబ్బులతో నన్ను కొనలేరు. అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నాఅని విమర్శించారు. విదేశీ బ్రాండ్ కాదు నేను వేసుకున్న చెప్పులు. అవి ఇక్కడ తయారుచేసినవే. దాంతో కొడతా.. పళ్ళు ఊడిపోతాయి. నాకు డబ్బు అవసరం లేదు. ఓ సినిమాకు 22 రోజులు కేటాయించా. రోజుకు రూ.2కోట్ల చొప్పున సినిమాకు 44 కోట్ల వరకూ తీసుకుంటున్నా. ఇది మీరిచ్చిన స్థాయి’ అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.