స్మార్ట్ ఫోన్లు వచ్చాక సెల్ఫీ మోజులో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే కేరళలో జరిగింది. పెళ్లి పీటలెక్కాల్సిన ఓ జంట క్వారీ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి 120 అడుగల లోయలో పడ్డారు. దీంతో పెళ్లికి ముందు రోజు గాయాల పాలై ఆస్పత్రిలో చేరారు. విను కృష్ణన్, శాండ్రా ఎస్ కుమార్‌లకు వివాహం కుదిరింది. వీరు గుడికి వెళ్లి దగ్గర్లో ఉన్న క్వారీకి వెళ్లారు.సెల్ఫీ కోసం క్వారీ అంచుదాకా వెళ్లటంతో అందులో పడ్డారు. స్థానికులు గమనించి బయటకు తీసుకువచ్చారు.