ఝార్ఖండ్ రాష్ట్రంలోని పలాములో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో ఫోనులో మాట్లాడుతూ భర్త మర్మాంగాన్నే కోసేసింది. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 13 నెలల కింద పెళ్లి అయ్యింది. అయితే అతను పెళ్లి చేసుకున్న యువతికి మరో యువకుడికి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి పలుమార్లు భర్త మందలించినప్పటికీ ఆమె తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతూ.. ఉండేది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్ని.. భోజనంలో నిద్ర మాత్రలు వేసింది. అది తిని స్పృహ తప్పి పడిపోయిన తన భర్త మర్మాంగాన్ని.. తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతూ.. అతను చెప్పినట్లు కోసేసింది. దీంతో కెవ్వుమని భర్త అరవడంతో.. హుటాహుటిన కుటుంబ సభ్యులు వచ్చి.. అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.