తళుక్కుమన్న హిమేశ్ పటేల్

© ANI Photo

భారతీయ మూలాలున్న నటుడు హిమేశ్ పటేల్ ఎమ్మీ అవార్డుల ఫంక్షన్‌లో తళుక్కుమని మెరిశాడు. బ్లాక్ షర్ట్, ప్యాంట్ వేసుకుని.. డిజైన్ వేసిన సూట్‌ని ధరించాడు. టెలివిజన్ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎమ్మీ అవార్డును సొంతం చేసుకోవడానికి ఉత్తమ నటుడిగా రేసులోకి వచ్చాడు. ‘స్టేషన్ ఎలెవెన్’ టీవీ షోలో జీవన్ చౌదరిగా నటించి మెప్పించాడు. తొలిసారిగా ఈ అవార్డు నామినేషన్లలో నిలిచాడు. కాగా, ఈ హీరో కుటుంబం భారత్‌లోని గుజరాత్‌లో నివసించేది.

Exit mobile version