అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పూర్తిస్థాయి కామెడీ చిత్రం ‘ఎఫ్3’. మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కోసం ఇప్పటికే చిత్రబృందం జోరుగా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రచారంలో మిల్కీబ్యూటీ తమన్నా లేకపోవడంపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ నిజానికి అలాంటిదేం లేదట. కేన్స్ లో తొలిసారి మెరుస్తున్న తమన్నా కోసం ఓ విస్కీ బ్రాండ్ కోట్లు కుమ్మరించిందని తెలుస్తోంది. వారి నిబంధనల మేరకే తమన్నా అక్కడే ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఎట్టకేలకు బుధవారం ముంబయికి చేరుకున్న తమన్నా…సినిమా బృందంతో ఎప్పుడు కలుస్తుందో చూడాలి.
-
Courtesy Twitter:tamannah
-
Courtesy Twitter:dilraju