ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ ఆస్కార్ అవార్డు కోసం RRR యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు పెట్టింది. అదే డబ్బుతో మేం 8-10 సినిమాలు తీసి ముఖాన కొడతాం. కేవలం వారు ఫ్లైట్ టికెట్ల కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోవటం కూడా టైమ్ వేస్ట్” అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుంటే మనవాళ్లే ఇలా మాట్లాడటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.