కొరటాల డైరెక్షన్ చేయనున్న మూవీపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం అనంతరం హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ‘ నా నెక్స్ట్ మూవీ చాలా పెద్దది. RRR క్వాలిటీకి ఇది మ్యాచ్ అవుతుంది. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నా’ అని అన్నారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. NTR 30 షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా ఆలస్యమైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు.