దేశ రాజధాని ఢిల్లీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు ముమ్మరంగా చర్చలు కొనసాగిస్తున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను బీహార్ సీఎం నితీష్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కలిశారు. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమి ఐక్యత సహా పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు హర్యానాలో ఎన్సీపీ నేత శరద్ పవార్, నితీష్, లాలూ సహా మరికొంత మంది విపక్ష నేతలు దేవీలాల్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. కేంద్రంలో ఈసారి ఏలాగైనా అధికారం సాధించాలని విపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
టార్గెట్ బీజేపీ..ఢిల్లీ కేంద్రంగా చర్చలు

Screengrab Twitter: