పెళ్లి చూపులు సినిమాతో యావత్ తెలుగు సినీ జనం తన వైపుకు చూసేలా చేసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాకు నో చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా తరుణ్ భాస్కరే ప్రకటించాడు. ఓ టాక్ షోలో పాల్గొన్న తరుణ్ మాట్లాడుతూ.. తనకు సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా కానీ వదులుకున్నానని తెలిపాడు. తన సప్లమెంటరీ పరీక్ష ఫీజులతో ఓ బిల్డింగ్ కట్టొచ్చని తరుణ్ భాస్కర్ తెలిపాడు.