టాటా మోటార్స్ నుంచి Altroz డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCA) వెర్షన్ కారు మార్కెట్లోకి వచ్చింది. ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక అధునాతన మోడల్ అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్లానెటరీ గేర్ సిస్టమ్తో ప్రపంచంలోనే మొదటిదని చెబుతున్నారు. ఈ వెర్షన్ హ్యాచ్బ్యాక్లో వెట్ క్లచ్ విత్ యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీ, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, సెల్ఫ్ హీలింగ్ మెకానిజం, ఆటో పార్క్ లాక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.8.10 లక్షలుగా ప్రకటించారు. 2022 Tata Altroz ఆటోమేటిక్ వేరియంట్ 6 మోడళ్లలో అందుబాటులో ఉంది.