ఆరెంజ్ ఆర్మీకి తప్పని పరాభవం.. కొంప ముంచిన బౌలింగ్

© IPL Photos - IPLT20.com

ఐపీఎల్‌లో ఆరెంజ్ ఆర్మీ బలం ఏంటని ఎవరడిగినా కానీ ప్రతి ఒక్కరూ కళ్లు మూసుకుని ఠక్కున చెప్పే సమాధానం బౌలింగ్ అని. మరి అట్లుంటది SRH బౌలింగ్. ఎంత చిన్న టార్గెట్ అయినా కానీ కాపాడుకున్న సందర్భాలు అనేకం. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో మాత్రం 195 పరుగులు చేసినా కానీ కేన్ సేన విజయం సాధించలేకపోయింది. చివరి ఓవర్ వేసిన మాక్రో జెన్‌సన్ అయితే ఏకంగా 4 సిక్సులు సమర్పించుకోవడం విశేషం. దీంతో ఆరెంజ్ ఆర్మీ వరుస విజయాలకు బ్రేక్ పడింది. మన స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ 5 వికెట్లు తీసి గుజరాత్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించినా కానీ లాభం లేకుండా పోయింది. అతడికి తోడు మిగతా బౌలర్లు పెద్దగా ఎవరూ రాణించలేదు.

Exit mobile version