తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి నేటినుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.[www.tstet.cgg.gov.in](url) వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 12న ఉ.9.30 – మ.12 గంటల వరకు పేపర్- 1, మ.2.30 -సా.5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్- 1కు 3,51,468 మంది, పేపర్- 2కు 2,77,884 మంది హాజరవుతున్నారు. ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్-1కూడా రాసే అవకాశం కల్పించారు.