సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగాక.. ఫాలోవర్లను పెంచుకునేేందుకు జనం చేసే వెర్రి వేషాలు కూడా పెరిగాయి. చిత్ర విచిత్రమైన పనులతో చిరాకు తెప్పిస్తున్నారు. కొందరైతే మనుషులకే కాదు జంతువులకూ చిరాకు తెప్పిస్తున్నారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డుపై ఎద్దు ముందు రీల్ చేసేందుకు ప్రయత్నించిన ఓ యువతి.. మూగజీవి తరమడంతో ఒక్కసారిగా పరుగులంకించుకుంది.