ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేశారు. గోపీనాథన్ స్థానంలో కే కృతివాసన్‌ను టీసీఎస్ సీఈఓగా నియమించింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీసీఎస్ పేర్కొంది. కాగా గోపీనాథన్ 22 ఏళ్ల పాటు టీసీఎస్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కంపెనీ ఎండీగా, సీఈఓగా దాదాపు ఆరేళ్లు పనిచేశారు. వచ్చే సెప్టెంబర్ వరకు ఆయన కంపెనీకి సేవలు అందించున్నారు. కాగా నూతన సీఈఓ కృతివాసన్ 34 ఏళ్లుగా టీసీఎస్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నాడు.