తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న కరీంనగర్‌లో భారీ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లా నాయకులు SRR కళాశాల మైదానంతో పాటు అంబేడ్కర్ మైదానాన్ని పరిశీలించారు. మొదట సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో ఆవిర్భావదిన వేడుకలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ భావించింది. కానీ కంటోన్మెంట్ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో సభా వేదిక మార్చాలని యోచిస్తోంది.