గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఎత్తుగడలకు సొంత పార్టీ నేతలతో చిక్కులు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ రావి వెంకటేశ్వర రావు, వెనిగండ్ల రాము మధ్య వర్గపోరు నడుస్తోంది. చాలాకాలంగా రావి ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తుండగా.. ఉన్నపలంగా రాముకి టికెట్ ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఇద్దరు కలిసి పనిచేయడం లేదని తెలుస్తోంది. ఫలితంగా నానిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో చంద్రబాబుకు మింగుడు పడటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.