గ్రాడ్యుయేట్స్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ-లెఫ్ట్ పార్టీలు పరస్పర సహకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. తమ అభ్యర్థులకు మద్దతివ్వాల్సిందిగా టీడీపీని లెఫ్ట్ పార్టీలు కోరాయి. రెండో ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేసేందుకు టీడీపీ అంగీకారం తెలిపింది. తమ రెండో ప్రాధాన్యత ఓటు టీడీపీ అభ్యర్థులకు వేసేందుకు లెఫ్ట్ పార్టీలు ఓకే చెప్పాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతు కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది. తద్వారా బీజేపీని ఒంటరిని చేసేలా పావులు కదుపుతోంది.