తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యెడ్లపాటి వెంకట్రావు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. హైదరాబాద్లోని కూతురు ఇంట్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. ఆయన మృతిపట్ల తెదేపా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బోడపాడులో ఆయన 1919లో జన్మించారు. రైతు నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి అనేక పదవులు చేపట్టారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కేబినేట్లో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన అనంతరం 1983లో కాంగ్రెస్ పార్టీని వీడి తెదేపాలో చేరారు. 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో పదవీకాలం ముగియడంతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
తెదేపా సీనియర్ నేత కన్నుమూత
