ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీలోని ఒంగోలులో ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలులోని సెయింట్ థెరిసా పోలింగ్ సెంటర్‌లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటర్లకు సహాయం చేసే క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘర్షణలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒంగోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ దామచర్ల జనార్థన్, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిలు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.