‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న అభిమానులు తమ ప్రేమను చూపిస్తూ థియేటర్ల్ ముందు బ్యానర్లు, కటౌట్లు కడుతున్నారు. మరి కొంత మంది టెక్నాలజీని వాడుకొంటున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఈ సినిమా హీరోలు చరణ్, ఎన్టీఆర్‌ల ముఖాలను రంగురంగుల పేపర్ కప్పులతో పేర్చారు. ఆ ఆర్టిస్ట్ 15వేల కప్పులతో 6రోజుల పాటు కష్టపడి ఈ ఆర్ట్ వేశారు. దానిని చూస్తే ఓవైపు తారక్, మరోవైపు చరణ్ ముఖాలు కనబడేలా అద్భుతంగా ఉంది. అయితే ఈ వీడియోను చూసి ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందించింది. అపారమైన మీ ప్రేమకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.