తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లలో చేసే ఆరోగ్య పరీక్షలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు 57 రకాల పరీక్షలు చేస్తుండగా.. వాటి సంఖ్యను 134కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 2018లో కేవలం హైదరాబాద్‌లోనే ప్రారంభమైన టీ డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రస్తుతం 20 జిల్లాలకు విస్తరించాయి. అలాగే కొత్తగా హైపటైటిస్, వైరల్, బ్యాక్టిరియా తదితర పరీక్షలు కూడ నిర్వహించనున్నారు. అలాగే ఆసుపత్రికి వచ్చిన రోగి డేటా దీర్ఘకాలం నిక్షిప్తమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.