సాధారణంగా చాయ్ (Tea) అంటే పాలు, టీ పొడి, చక్కెర వేసి చేస్తారనే సంగతి తెలిసిందే. గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ కావాలంటే పాలు లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇందులో అల్లం, ఇలాచీ, మిరియాలు ఇలా రకరకాలు వెరైటీలతో టీ చేసుకొని తాగవచ్చు. కానీ, పాలతో అవసరం లేకుండా పండ్లతో చాయ్ తయారు చేస్తున్నారు. గుజరాత్ లోని సూరత్ లో ఓ వ్యాపారి ఇలా పండ్లతో టీ తయారు చేస్తున్నాడు. మామూలు చాయ్ లాగానే టీపొడి, పాలు వేసి తర్వాత రకరకాల పండ్లు వేసి మరిగిస్తున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.