ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఉచిత, నిర్భంధ విద్య నియమాలు-2010కు సవరణ చేసింది. టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించవద్దని ప్రకటించింది. ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించిన తర్వాత అవసరం ఉందంటేనే ఉపాధ్యాయులను విధులకు పంపొచ్చు అని పేర్కొంది. కాగా ఎన్నికల విధులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగించునేందుకే ఈ ఎత్తుగడ అని విమర్శలు వస్తున్నాయి.