టీ హబ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అద్భుత పనితీరు ఇందుకు కారణమని వెల్లడించారు. ఇండియా ఫండ్ పేరుతో టీహబ్‌కి నిధులు సమకూర్చేందుకు డల్లాస్ వెంచర్ క్యాపిటల్ ఒప్పందం కుదర్చుకుంది. “ డల్లాస్ వెంచర్ క్యాపిటల్ భారత్‌లో ఎన్నో స్టార్టప్‌లు నెలకొల్పింది. భారత్‌లో 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలన్న వారి ఆలోచన గొప్పది. మంచి ఆలోచనలు ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదు. డబ్బు వృథా కాకుండా ఎలా నిర్వహిస్తారనేది ముఖ్యం” అన్నారు.