శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ను 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సర్ రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వికెట్ కీపర్ పంత్ 96 పరుగులు చేశాడు. అశ్విన్, విహారిలు హాఫ్ సెంచరీలు చేశారు. ఇక లంక బౌలర్లలో సురంగ లక్మల్, ఫెర్నాండో, ఎంబుల్దేనియా తలా 2, డిసిల్వ, కుమార చెరో వికెట్ తీసుకున్నారు. ఈ టెస్టు ప్రస్తుతం రెండో రోజు టీ వద్ద కొనసాగుతోంది. లంక బ్యాటర్లు ఎలా ఆడుతారో వేచి చూడాలి.