లంకతో తొలి వన్డేలో భారీ స్కోరు సాధించిన టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఒక ప్రత్యర్థిపై అత్యధిక సార్లు 300+ స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో రెండో స్థానానికి చేరింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలో ఉంది. ఇండియాపై ఏకంగా 28సార్లు కంగారూలు 300+ స్కోర్లు చేశారు. ఆ తర్వాత ఇండియా లంకపై 22 సార్లు, మూడో స్థానంలోనూ టీమిండియానే ఆస్ట్రేలియాపై 21 సార్లు, నాలుగో స్థానంలో ఇంగ్లండ్‌పై ఇండియా 18 సార్లు 300+ స్కోరు నమోదు చేసింది.