ఉప్పల్లో ఈ నెల 18న జరిగే మ్యాచుకు భారత్, న్యూజిలాండ్ జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. టీమిండియా ప్లేయర్లకు పార్క్ హయత్ హోటల్లో బస ఏర్పాటు చేయగా.. న్యూజిలాండ్ ఆటగాళ్లకు తాజ్ కృష్ణాలో ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ కోసం కివీస్ ఆటగాళ్లు శనివారమే హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం రాజీవ్ గాంధీ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా చేశారు. తిరువనంతపురం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం బస్సులో ప్లేయర్లు పార్క్ హయత్ హోటల్కి చేరుకున్నారు.