మూడో టీ-20 మ్యాచ్ లో టీమిండియాకు వెస్టిండీస్ 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణిత 20 ఓవర్లలలో 164/5 స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో మేయర్స్ చెలరేగి ఆడాడు. 73 పరుగులు చేశాడు, పోవెల్ 23 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, హార్ధిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.